ఆఊరు మీకు బాగా నచ్చుతుంది. అమెరికాలో మాడిసన్‌కు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరీ నా లాగే. అయితే ఆ ఊరు ఎరీనా మొక్కజొన్న చేలల్లో కవి త్వం గుణ్‌గుణాయించే వాళ్లలా మాత్రమే ఉండదు. ఆ ఊరు చిత్తడి నేలల్లో నెత్తురు చిందించి బీలను కాపాడుకునే ఊరు. ఉత్తరాంధ్ర కోనసీమ. ఉద్దానంలో ఆ ఊరు. పేరు సోంపేట.
యాధృచ్ఛికం కాదుగానీ, సోంపేట, బారువాల మధ్య పెదబీల, చిన్న బీలల్లో నీళ్ల కోసం భూమిని రక్షించు కోవడం కోసం యుద్ధానికి తెగబడిన సోంపేటకు, కడుపు లో నీళ్లు కదలకుండా ఉండడం కోసం పలాసపురం గున్నజోగారావు, గొనప కృష్ణమూర్తి తమ మరిగే నెత్తురును ధారవోసిన సోంపేటకు, కడుపులో చల్ల కదలకుండా కవి త్వం చదువుకొని పురాయాదులను తవ్వుకొనే ఎరీనా రైతు కవులకు పోలిక ఉంది.
ఎరీనా నిశ్చల చిత్రం. సోంపేట సుడులు తిరిగిన జలతరంగ దృశ్యం. సోంపేట ఇప్పుడు నడుస్తున్న విస్థాపనకు, విధ్వంసక అభివృద్ధికి, ప్రభుత్వాలు వారే, దళారీలు వారే, కార్పొరేట్లు వారే అయిన వ్యవస్థీకరించిన పాలక పక్షాలకు ప్రాణాలొడ్డి పంట చేలల్లో ఉత్త చేతులతో, కొత్త గొంతులతో, కర్రలతో, కాళ్లకు కట్టుకున్న చేతనా విద్యుత్ తరంగాలతో గెడ్డెలు పోటెత్తినట్టు, ఎగిరి దుంకిన ట్టు ఎదురీది నిలబడిన కడలి తరంగం. హద్దులు చెరిగిపోయిన వ్యవస్థాపక నిర్మాణాలిప్పుడు ప్రపంచవ్యాప్త వ్యవస్థ లు.
అమెరికా దానికి మూలం. అది తన్నుతాను ధ్వంసం చేసుకుంటూ ప్రపంచాన్ని ధ్వంసం చేసే అభివృద్ధి నమూనాలను సరఫరా చేస్తున్నది. ఎరీనా పురాస్మృతులేవైనా ఉంటే, అవే. 'సమ్మతి తయారీ' గురించి రాసిన నోమ్‌ఛామ్‌స్కీకి, భారతదేశంలో ఇదే తరహాలో సమ్మతి తయారీ యే కాదు 'ప్రభుత్వాల తయారీ' కఅూ్ఖఊఅఇఖ్ఖీఖఐూఎ ఎౖగఉఖూకఉూఖీఖి సంగతి ఇంకా ఉప్పందవలసే ఉన్నది.
మనవాళ్లు ఈ మార్గంలో మధ్యలో లేరు. ఎంతో ఎత్తు ఎదిగారు. గనుల మాఫియా సామ్రాజ్యంతో కర్ణాటక ప్రభుత్వ తయారీని చేసి చూపించి, ఢిల్లీ ప్రభుత్వ తయారీకి నోట్లు కుడుతున్న, ఇనుప ఖనిజం జమ చేస్తున్న రెడ్డి సోదరుల గురించి కూడా నోమ్‌ఛామ్‌స్కీకి తెలిస్తే బాగుండు. కలకత్తా నుంచి నెల్లూరుదాకా తీరం పొడవునా ఆవహించే బొగ్గు కుంపట్లు థర్మల్ కారిడార్లు.. ఏ అభివృద్ధి కోసం.. ఏ మర్చంట్ విద్యుత్ కంపెనీల కోసం.. ఈ మర్చంట్ విద్యుత్ కంపెనీల లెక్కల కింద, ప్రణాళికల వెనుక, పైసా లెక్కల వెనక.. పెరిగిన వాల్యుయేషన్‌ల వెనుక ఎవరి వికృత ముఖాలున్నాయి.
థర్మల్ కారిడార్‌కు, వాన్‌పిక్‌లకు, ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఆరు థర్మల్ కుంపట్లకు మొత్తంగా భారతదేశాన్ని తవ్విపోసే గనుల ఘరానా దోపిడి, భూ ఆక్రమ ణ, బొగ్గు వేగవంతంగా తవ్వడానికి, మనుషుల శవాల బొందల గడ్డలు తవ్వుతున్న ఓపెన్‌కాస్ట్ తవ్వకాలకు, ఇండోనేషియాలో బొగ్గు గనుల కొనుగోలు చేసిన హస్తాలకు ఎంత లింకుందో? అంత లింకునూ గమనించనంత వరకు.. ఈ అభివృద్ధి విధ్వంసం వెనక ఉన్న వికృత ముఖం ప్రభుత్వం, కార్పొరేట్, దళారీ కలెగలిసిన ఒక మాన్‌స్టర్‌దేనని గమనించనంత వరకు సోంపేట ఒంటరి.
అది ఒంటరి కాదు. అదొక భారతదేశపు అనేక ప్రాంతాల జంటపదం. సింగూరు తనను తాను వెల్లడించుకున్నది కనుక.. నందిగ్రామ్ కూడా చనిపోవడానికీ, చంపడానికీ సిద్ధపడింది కనుక.. సోంపేటకు అవి జంట పదాలు.. భారతదేశం నిండా పెరిగిపోతున్న సోం పేటలు రేపటి సామాన్యు ల కదనరంగాలు. ఛత్తీస్‌గఢ్ కావొచ్చు. ఒడిషా నారాయణ్ పట్న కావొ చ్చు. బెంగాల్ కావొచ్చు. బీహార్ కావొచ్చు. అది సెజ్ కావొచ్చు. గని తవ్వకం కావొచ్చు. అభివృద్ధి కోసం, వెలుగుల కోసం, రసాయనాలకోసం, ఎరువుల కోసం తీసుకునే, ఆక్రమించుకునే ఏ భూమి అయినా కావొచ్చు.
బుగతగాడిప్పుడు మారువేషంలో ఉన్న మారీచుడు. వాడు అంతుబట్టని దళారీ, కార్పొరేట్ దొంగ, ప్రభుత్వ నేత. అన్నీ కలెగలిపిన మహారాక్షసు డు. ఎట్లా చంపగలవు. ఉద్దానం ఒకప్పటి స్టాలిన్‌గ్రాడ్. తామాడ గణపతి నడయాడిన నేల, సుబ్బారావు ప్రాణిగ్రాహి గానం సుడులు తిరిగిన నేల. బొడ్డపాడు నడిగెడ్డలో గరుడభద్ర బుగత మద్ది కామేశ్వరరావును చంపినంత సుల భం కాదిది. తంపర కోసం, పెదబీల, చినబీల కోసం, ఏడాది పొడవునా ఉద్దానాన్ని ఫిల్టర్ చేసే, వరదలకు రక్షిం చే, వానల్లేనప్పుడు దూపదీర్చే.. మూత్రపిండాలా చిత్తడినేలలు.. కొబ్బరి చిప్పల్లో నిలిచిన నీళ్లు డెంగీలు, చికున్‌గున్యాలు.. చివరికి మూత్రపిండాల వ్యాధులను కట్టబెట్టిన ఇదే ఉద్దానానికి థర్మల్ బొగ్గుకుంపటి.. బూడిద సముద్రా లు వచ్చి పడ్డాయి. ఇప్పుడిక అంత సులభం కాదు.
అందుకే.. డూ ఆర్ డై.. చావు లేదా చంపు.. నీటి కోసం నిప్పులా మండు.. దేశి గెడ్డకోసం.. గరీబుల గెడ్డ కోసం.. ఏనుగుల గెడ్డకోసం.. సోంపేట నెత్తురు ఏరులై పారినా సరే.. ఇప్పుడిక భూమి కోసం.. భూమిలేని వాళ్లు చేసే పోరాటం ఎంత మాత్రం కాదింక.. భూములు కోల్పోయిన వాళ్లు.. తమ భూములు కాపాడుకోవడానికి చేసే పోరాటం.. ఇదీ నలభై ఏళ్ల పోరాటాల, ఆరాటాల శ్రీకాకుళం ప్రశ్నే కాదు.
ఇదివ్వాళ్టి దేశం సామాన్యుల ముందు, రైతుల ముందు, మత్స్యకారుల ముందు, దళితు ల ముందు, స్త్రీల ముందు, అణగారిన వారి ముందు, అన్నార్తుల ముందు, అభాగ్యుల ముందు నిలువెత్తునా నిలబడిన ప్రశ్న.. సకల మానవ ప్రాకృతిక వనరులను పెట్టుబడికి అప్పగించడమే నేటి సూత్రం. అది ఢిల్లీ కేంద్రంగా ..జంగల్ మహల్ నుంచి ఉత్తరాంధ్ర దాకా.. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా దాకా.. మనిషి అవసరాలిప్పుడు.. పెట్టుబడి అవసరాలు.. మున్నూటా అరవై ఐదు పొద్దులూ నిన్ను కాపాడే తంపర, బీలలు థర్మల్ కుంపట్ల అవసరాలు.. అందుకే.. సోంపేట ఇవ్వాల్టి వేగుచుక్క. అదొక వ్యవస్థీకృతమైన విధ్వంసక దోపిడీ మార్గాన్ని ఎదిరించిన తొలిపొద్దు.. పర్యావరణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ, అక్రమాలు, అన్యాయాలు?, పారిశ్రామిక అభివృద్ధి లేదంటే ఎట్లా? కరెంటు వద్దా? వెలుగులెట్లా? అని నంగినంగిగా గుణ్‌గుణాయిస్తూ.. అడిగేవాళ్లకు.. బహుశా.. ఈ దేశం ప్రకృతిపైన, వనరులపైన, ఈ భూమిపైన ఆధారపడి బతికే మనుషుల నోటికాడి కూడు గుంజుకొని, కార్పొరేట్లకు కట్టబెట్టడా న్ని వ్యవస్థీకృతం చేస్తుందని, సింగూరు, నందిగ్రామ్, సోంపేటలు అందుకే అని తెలియకపోతే సోంపేట అర్థం కాదు.
83 సంవత్సరాల క్రిందట బారువాకు గాంధీ వచ్చి గ్రామ స్వరాజ్యం, స్వావలంబనల గురించి, స్వయం సమృ ద్ధి గురించి చెప్పిన మాటలు ఇప్పుడొక విధ్వంసక నమూనా అభివృద్ధిలో వినపడకపోవచ్చు. 223 దినాలు నిరాహారదీక్షలు గాంధీ గారి కోసం చేసినా.. కడుపులో నీళ్లు కలబారుతున్నప్పుడు ఇదే బారువా తీరవాసులు.. నెత్తురు డొల్లాడించడం వారి తప్పుకాదు.
గాంధీని అనుసరించని విధ్వంసక అభివృద్ధిది.. ఉద్దానం మళ్లీ ఒకసారి ఉత్థానంగా వెలిగింది. ఆ వెలుగు భారతావనిలో విధ్వంసక అభివృద్ధికి వ్యతిరేకమైంది. దాన్ని ఆరిపోకుండా కాపాడుకొందాం.. మనుషు లం.. మనుషులుగా బతుకుదాం.. పోరాడి అయినా సరే.. ప్రాణాలు పోయినా సరే.. అదొక్కటే దారి.. తెలంగాణ అయినా, ఉత్తరాంధ్ర, అయినా, సీమ అయినా విధ్వంసం.. వెనుకబాటుతనంతో పాటు తీవ్ర ప్రభావం చూపే ఒక వికృతం.. దాన్ని ఎదిరిద్దాం.. ఎరీనాలో కవిత్వం చదవడం ఒక కళ.. సోంపేటలా తిరగబడడం ఒక జీవన్మరణ పోరా టం... సోంపేట ఒక తుట్టే.. ఒక చిక్కుముడి.. అమెరికా నుంచి ప్రపంచానికి పరివ్యాపించిన ఒక జబ్బుకు సోంపేట తిరుగుబాట పరిష్కారం. (ఎరీనా కవిత్వ పఠనంపై అఫ్సర్ వ్యాసం సోమవారం 'వివిధ'లో వచ్చింది.)
No comments:
Post a Comment