వీర తెలంగాణ వేరు తెలంగాణ పురిటినొప్పులు పడ్తున్న ది. బయటపడ్డ పేగులను కడుపులో కాసెకట్టుకుని పోరాడిన ఎర్రజెండా తెలంగాణ. పారిన నెత్తురు పొత్తిళ్లకెత్తుకు ని పోరాడిన తెలంగాణ, విశాలాంధ్రలో ప్రజారాజ్యాన్ని ఓడిన తెలంగాణ ఇప్పుడొక ఆత్మగౌరవ కలను కంటున్నది. కల సాకా రం కానున్న సందర్భాన్ని కనురెప్పల కింద దాచుకొన్నది. ఇలాంటి ఈసందర్భంలో 1948, సెప్టెంబర్ 17.. విమోచన దినమా? విలీన దినమా? విద్రోహ దినమా? ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఓటమి దినమా? సర్దార్ పటేల్ విజయ దిన మా? ఏం పేరు పెట్టవచ్చు.
హైదరాబాద్ స్టేట్‌కు, విభజన తర్వాత హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా రూపుదిద్దుకుని స్వతంత్ర రాష్ట్రంగా చెలామణి అయి, విశాలాంధ్రలో కలిసిపోయిన తెలంగాణకు స్వంత అస్తిత్వం ఏర్పడిందా? కొందరు భావిస్తున్నట్టు అది మిశ్రమ అస్తిత్వమా? దానికదిగా ఒక భౌగోళిక ప్రాంతపు ఆత్మగా చెప్పుకునే ఉమ్మడి ఉద్వేగ భావాల సమాహారం ఏర్పడలేదా? ఎన్ని ప్రశ్నలు.. సమాధానాలు లేవా? ఉన్నాయి.
కమ్యూనిస్టులు చూస్తున్న చూపుకు, భారతీ య జనతాపార్టీ దృక్పథానికి, ఇవ్వాల్టి అచ్చ తెలంగాణ అస్తిత్వ వాదుల లో- చూపుకు, ముస్లింల భావనలకు మధ్య 1948, సెప్టెంబర్ 17 ఒక ప్రహేళిక. అది విమోచన! విముక్తి ఏదీ కాద నే నుంచి విమోచనే! అనేదాకా ఇప్పుడొక చర్చ సాగుతున్నది. కానీ చరిత్రను ఎట్లా ఒడిసిపట్టి.. మనదైన నెత్తుటి చరిత్రను వర్తమానంలోకి లంకె కలపడానికి ఎవరికీ అభ్యంతరాలుండక్కరలేదు.
ఒక దినంగా జరుపుకుంటామనేకన్నా.. ఒక చరిత్ర గా ఎలాంటి వర్తమానానికి ఈ దినం బాటలు వేసిందనేదే ఇప్పటి అవసరం. 1948ని మాట్లాడుకోవడానికి ముందు తెలంగాణవాదులు 1952ను మాట్లాడుకున్నప్పుడు ఇది అచ్చంగా ఒక విద్రోహ దినంగానే కనబడ్తుంది. గైర్‌ముల్కీ ఉద్యమంలో సిటీకాలేజీ విద్యార్థులు అర్పించిన ప్రాణాల వెలుగులో దీన్ని చూడవలసే ఉన్నది. 'ప్రపంచంలో ఇప్పుడు మూడే మూడు దేశాలలో ఆక్రమిత సైన్యాలున్నాయి.
అవి జర్మనీ, జపాన్, హైదరాబాద్'-1952 'ఇడ్లీ సాంబార్ గోబ్యాక్' పోరు తర్వాత జరిగిన కాల్పుల సంఘటనపై విచారణ జరిపిన కమిటీ ముందు సరోజినీ నాయుడు కుమారుడు డాక్టర్ ఎన్.ఎం. జయసూర్య ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మాటలన్నా రు. అంటే 1948 సెప్టెంబర్ 17 మొదలుకొని, నాలుగురోజుల్లోనే ముగిసిన యూనియన్ సైన్యాల పోలో ఆపరేషన్ నిజాం రాజ్యాన్ని విలీనం చేసుకున్నాయి. నిజమే.
కానీ.. ఆ తర్వాత జరిగిందేమిటి? 1948కి ముందు యూనియన్ సైన్యాలు నిజాంతో కుదుర్చుకున్న యథాతథ ఒడంబడిక సారాంశం ఏమిటి? ఎవరి నుంచి విమోచన కోసం యూనియన్‌సైన్యాలు హైదరాబాద్ స్టేట్‌లో ప్రవేశించాయి. 1948-51 మధ్య కాలం లో ఎంతమంది కమ్యూనిస్టుల ఊచకోత జరిగింది. ఎంతమంది ముసల్మానుల నెత్తురు ఏరులై పారింది. లక్షల లెక్క. ఎంతమంది దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దా ర్లు.. రూమీటోపీలు ధరించి మళ్లీ గ్రామాల్లోకి చేరారు.
మూడు వేల గ్రామాల్లో ఎగరేసిన ఎర్రజెండాలు ఎట్లా వెలిసిపొయ్యా యి? పదివేల ఎకరాల భూమి ఏమయింది? గడీలు కూల్చి, గ్రామగ్రామానా దేశ్‌ముఖ్‌లను, జాగీర్దార్లను వాళ్ల కొమ్ముకాసిన నైజాంను, ఆయన మతసేనలను ధిక్కరించి, ఓడించి, తరి మి, గెదిమి గెలుచుకున్న భూములు ఎవరి పరమయ్యాయి. దొడ్డి కొమరయ్య, బందగి చిందిన రక్తం, చాకలి ఐలమ్మ.. బండియాదగిరి పాట ఎక్కడ మలిగిపోయింది.
ఈ ప్రశ్నలకు సమాధానం వెదికితే విమోచనమా? విలీనమా? విద్రోహమా? బయటపడ్తుంది. ప్రత్యేక అస్తిత్వం ఇప్పటి సందర్భమైనప్పుడు 1948, సెప్టెంబర్ 17న పీడకలలు కన్న ముసల్మానుల మనసు గెలుచుకోకుండా తెలంగాణ సాధ్యమేనా? ఒక త్యాగం కాదు. ఒక పోరాటం కాదు. తెలంగాణ ఒక యుద్ధభూమి. ధిక్కార భూమి. చరిత్ర వేరు. ఉద్వేగం వేరు కావొచ్చు.. కానీ.. తెలంగాణ చరిత్రంతా రణరక్త చరిత్ర.
అది కాకతీయుల మీద కత్తి దూసిన సమ్మక్క, సారక్కలు, జంపన్నవాగుల్ల, జాలారిబండ ల్ల వీరోచిత పోరు సలిపిన పగిడిగిద్దరాజు కావొచ్చు. ఢిల్లీ సర్కారు గుండెలదరగొట్టిన కాకతీయ ప్రతాపరుద్రుడు, రాణీరుద్రమలు కావొచ్చు. మొఘల్ ప్రభువు గుండె ల్లో నిదురించిన సర్వాయి పాపడు కావొచ్చు.. ఒకే మర్రి చెట్టు కు మూడు వందల మంది ఉరిపడ్డ శిరస్సులు చెప్పిన రహస్యం రాంజీగోండు కావొచ్చు. బ్రిటన్‌లకు సై అంటూ సవాల్ విసిరి కోఠి రెసిడెన్సీలో ప్రాణాలర్పించి తుర్రెబాజ్‌ఖాన్ కావొచ్చు.
గడీని ప్రశ్నించిన చాకలి ఐలమ్మ కావొచ్చు. గోండుల స్వతంత్ర పతా క ఎగరేసి బ్రిటన్, నిజాం తొత్తులను తుత్తునియలు చేసిన కొమురం భీం కావొచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛకోసం ప్రాణాలర్పించిన షోయబుల్లా ఖాన్ కావొచ్చు. తెలంగాణ అస్తిత్వమే రణ రక్త చరిత్ర.. పోరాటం ఊపిరిగా బతకడం. ధిక్కరణ. వందల ఏళ్ళ అవిశ్రాంత పోరాటం.. నిజమే.. బందగీ, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల నాటికి సంగం ఉంది. కమ్యూనిస్టు పార్టీ లేదు.
కమ్యూనిస్టు పార్టీ సకల శ్రమ జీవుల భూమి, భుక్తి, విముక్తి పోరాటాలకూ తెలంగాణ నెత్తురు చిందింది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం రాలేదు. అదీ అసలు విషయం.. ఇక ప్రారంభం. వలసలు పెరిగాయి. యూనియన్ సైన్యాలు ప్రతిష్ఠించిన రూమీ టోపీలతో పాటు, కామ్రేడ్స్ తోవలు చూపి న నల్ల రేగళ్ల భూముల పొంటి ఏర్పడ్డదే ఇవ్వాళ్టి సమైక్యవా దం.. చెబుతున్న నాజూకు మాటలు. మంచితనంతోనూ, సహనంతోనూ, శాంతి, ఓదార్పులకు ఆస్కారమిచ్చే విధంగానూ వాళ్లొచ్చారు.
ప్రజారాజ్యం నినాదం,మరోవైపు స్వాతంత్య్ర కాంక్ష.. ఎవరు స్వేచ్ఛ కోల్పోయా రు. ఎవరు భూమి కోల్పోయారు? ఎవరు నోటికాడి కూడు కోల్పోయారు. ఎవరు రావాల్సిన కొలువు కోల్పోయారు? ఎవరు కాలక్రమేణా యాభై నాలుగు సంవత్సరాలలో తమ ప్రాంతం తాము అడుగుతున్నందుకు విద్రోహులవుతున్నరు? దేశ ద్రోహులవుతున్నరు? అన్యాయాలను ఎలుగెత్తుతున్నందుకు ప్రాంతీయ సంకుచితవాదులవుతున్నరు.
దీనికిమూలం ఎక్కడ.. రెసిడెన్సీ పాలనలో నీటి పారకంలో.. ఎక్కితొక్కొచ్చిన పెట్టుబడులు .. పెరిగిన నయా ధనిక స్వామ్యం.. ప్రవహించిన పెట్టుబడులు.. మార్కెట్‌గా మారిన హైదరాబాద్ స్టేట్.. రెసిడెన్సీలో జరిగిన స్వాతంత్య్రోద్యమ పరిచయాలు, పలుకుబడి.. యూనియన్ సైన్యాల జయం తర్వాత కోస్తాంధ్ర పెట్టుబడులతో చెలిమి కట్టిందెవరు? నెవురయ్య రంగు బహిరంగమై.. ఇందిరమ్మ తెలంగాణను అణచివేసి.. ఇవ్వాల్టి దాకా.. నిజమే ఈ గడ్డమీద కమ్యూనిస్టు పోరాటం జరిగింది.
అది విఫలమైంది. గెలుపులు ఓటములయ్యాయి. కానీ ఆ పోరాట ఫలాలు చివరికి తెలంగాణకు వికృ త శిశువును ఇచ్చింది. పెట్టుబడికి ప్రవహించే స్వభావంతో పాటు సామ్రాజ్యవాద కాంక్ష ఉంటుంది. దానిఫలమే కదా తెలంగాణ అనుభవిస్తున్న వలసాధిపత్యం.. అది మాట్లాడుతు న్న తేనె పూసిన కత్తి మాటలు.. నాజూకు సన్నాయి నొక్కులు. అందుకే.. తెలంగాణ వాదులారా! అది విమోచనం కాదు.
విలీనమే. కానీ.. వలసలకది మూలమయినందుకు తెలంగాణకది విద్రోహ బీజాలు వేసిన దినమే. ఇక ఎవరి ఇష్టం వారిది. చరిత్ర ఒకటే.. తెలంగాణ పురిటిగడ్డ.. పోరాడుతూనే ఉన్నది. ఓడి పోతున్నా పోరాడుతున్నది. మొండాలతోనూ.. ఖండిత దేహంతోనూ అదిప్పుడు ఒకటే అడుగుతున్నది. ఇన్ని త్యాగాలు చేశాం..ఇప్పుడిక త్యాగాలు పుష్పించనీ.. ఫలించనీ.. మా ప్రాం తం మాగ్గావాలె. మా తెలంగాణ మాగ్గావాలె..
ప్రాణహిత
Saturday, August 28, 2010
యే షహర్ హమారా..
ఆప్ పర్ భీ ఫూల్ బర్‌సే: ఔర్ హమ్ పర్ భీ:
ఫర్క్ ఇత్నాహీహై: ఆప్ డోలీమే హై: హమ్ డోలేపే హై!
(మీపై పూలు కురిశాయి. మాపై కూడా కురిశాయి.
కానీ.. తేడా ఒక్కటే.. మీరు పల్లకిలో ఉన్నారు. మేము పాడెపై ఉన్నాము)
తండ్రీ.. ఈ హైదరాబాద్ ఎవరిది. ఆక్రమణదారులదా? ఇక్కడి భూమి పుత్రులదా? నిజమే.
పల్లకిలో ఊరేగుతున్నా రు. మేము పాడెపై ఉన్నాము. హైదరాబాద్ ఊరు పొందిచ్చిన మహమ్మద్ కులీ కుతుబ్‌షా 'నదిలో చేపలు నిండాలనుకున్నడు'..కానీ .. హైదరాబాద్ నదిలో షార్క్‌లు నిండాయి. కబ్జా చేసిన షార్క్‌లు. మొత్తాన్ని ఆక్రమించుకుని 'ఇటేటు రమ్మంటే ఇల్లంత నాదనే' చేపలు కావవి షార్క్‌లు.
ఎవరిదీ హైదరాబాద్. సర్పంలా చుట్టుకున్న రింగురోడ్డు పొంటి మేము లేము. మాల్స్‌లో లేము. మలేషియా టౌన్ షిప్పుల్లో లేము. కూకేటి పామైన కూకట్‌పల్లిలోనూ లేము. దిల్‌సుఖ్‌నగరూ, వివేకానంద కాలనీ.. వెంగళరావు నగర్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు, ఎల్వీ ప్రసాద్ మార్గ్, ఎన్టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్డూ.. హుసేన్‌సాగర్ ఒడ్డూ పొడవైన విగ్రహాల్లోనూ లేము.. పాతబస్తీలోనో, చార్మినార్ గల్లీలోనో? పుత్లీ బౌలీలో నో, రాజన్న బావిలోనో, లంగర్ హౌస్‌లోనో, మంగళ్ హాట్‌లోనో, బోరడంబలోనో కుదించుకుపోయి మూలనపడ్డ మూటల్లా పడి ఉన్నాము తండ్రీ.. విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, నూరంతస్థులు, ఏడుమేడలూ.. తండ్రీ.. మమ్మల్ని నెట్టేసుకు వెళ్లింది.
అభివృద్ధి రథం.. తెలంగాణ ముస్లిముల సంగతెందుకూ? మాట్లాడడం. ఉర్దూ భాషా పోయింది. సంస్కృతీపోయింది. పాతబస్తీ ఒక పరాధీన. కొత్త సొగసు లు. ఏవీ తండ్రీ.. ఒక్క ఫ్లైఓవర్ జాడల్లో నీలిగిన బతుకులు.. హైదరాబాద్ అంటే ఇప్పుడేది టావెర్నియన్ (ఫ్రెంచి యాత్రికుడు) పోల్చి చెప్పిన ఫ్రాన్స్‌లోని ఆర్లియన్స్ నగరం ఇదేనా?
మూసీలో మంచినీళ్లు నింపితే.. పారిస్తే.. ప్రవహిస్తే.. వెనిస్ నగరంలా తళుకు లీనేదీ ఇదేనా? అవొచ్చు.. కానీ ఆ మూల చార్మినార్ దాపల.. పక్షుల రెక్కలు టపటప కొట్టుకులాడం గ.. వెలిగే మక్కా మజీద్ దగ్గర.. సైకిల్ పంక్షరేస్తూ.. సామా న్లు తుడుస్తూ.. కడుగుతూ.. నెమలీకల విసనకర్రలు విసిరే ధూపం వేస్తూ.. బతుకు బండలైంది కద తండ్రీ.. పురానే యాదే.. పురానే దర్ద్.. ఒక్క ఇరానీ చాయ్ కోసం ఒక్క ఉస్మానియా బిస్కట్ కోసం..జిహ్వ చచ్చిందిరా.. ప్రాణం సొడసొడలు పోతంది. నాలుక గుంజుతంది.
గోల్కొండ కోట కింద, పాతబస్తీకింద, ఉస్మాన్ అలీఖాన్ పన్నులు పిండిన మరిగిన నెత్తురు క్రింద.. చంద్రబాబు ప్రపంచీకరణ క్రింద, రాజశేఖర్‌రెడ్డి బార్లా తెరిచిన.. బారాఖూన్ మాఫ్ కడుపు నింపుకున్న కార్పొరేటీకరణ క్రింద ఎవడి మల్లె తోటలున్నయి. ఎవరి చిల్లర దేవుళ్ల మూలుగులున్నయి.
ఎవరి వాగుల వంకల ఇసుక తుఫాన్లున్నయి. ఏఏ జిల్లాల కొండలు, గుట్టలు, చెట్లూ పుట్టలున్నయి... అవు నూ ఈ హైదరాబాద్ ఎవరిదీ? కన్నుగొట్టే లబ్బ రు బొమ్మల ముందు.. అడ్డాలో షోకేస్‌లా అంగ డి బొమ్మలా.. దేశదేశాల సంపన్న వర్గాల రణస్థలి.. రంగస్థలి.. అయిపోయిన ఈ హైదరాబాద్ ఎవరిది?
ఎవరి జీవునాలు ఎవరినెత్తుటి కన్నీళ్లింకితే ఇన్నేసి బంగ్లాలు.. ఇన్నేసి భూములు... కబ్జా పెట్టినోడు హైదరాబాద్ మీద హక్కు కోరుకోవడం.. ఎంత న్యాయం? ఏది ధర్మం? తెలంగాణ రక్త మాంసాల మీద.. తెలంగాణ రైతుల పుళ్లుపడ్డ చేతులు చేసిన వెట్టిచాకిరీ మీద నిర్మితమయిందీ నగరం.. పుట్టుక దానిదే.. చావూ దానిదే.. ఎప్‌బెల్‌లు, ఎమ్మార్ ప్రాపర్టీలు, మైక్రోసాఫ్ట్ లు, దివారాత్రులు నడిచే బాడీషాపు కంపెనీలు, అర్ధరాత్రుళ్లు మేల్కాంచే, దయ్యాలను కనే బ్లూచిప్ కంపెనీలు.. పొలారీస్ లు, ఇన్ఫోసిస్‌లు, విప్రోలు,తెప్పలు తెప్పలుగా వచ్చిన కార్పొరేట్ దేశీయ దళారీల మంద.. విదేశీల పాదాలు కడిగి తలమీద పోసుకునే.. మూక.. భాగ్యనగరం బహుళ జాతి కంపెనీల వాకిలయింది.. అది పొక్కిలయింది.
హైదరాబాద్ దురాక్రమణకు మూలం కొత్తగా చెప్పనక్కరలేదు. ఎవడి వనరుల మీద, ఎవడి మౌలిక వసతుల మీద..ఎవడి భూముల మీద నిర్మితమయిందీ నయా నంగనాచి నగ రం.. అది లెక్కతేలాలిప్పుడు..పెదవాగు పేగు ఎండిపోయినప్పుడు కదా..
ఇసుక లారీలు సర్రు న దూసుకొస్తేకదా.. సర్ఫెకాజ్‌లు, పారిపోయిన జాగీర్దార్లు పాయెగాల కోకాపేటలూ.. నిలవడి నిండి.. నిలువు భవనాలయినయి. పంట పొలా లు.. మల్లె తోటలు.. కూరగాయల పాదులు.. బర్రెలు మేసే పచ్చిక మైదానాలు.. పిల్ల కాలువ లు.. మల్లెల గంధం వీసే మట్టి భూముల్లో కదా... మీ కోటలు దాటిన అభివృద్ధి సౌధం నిలిచింది.
పదిహేడు లక్షల ఎకరాలలో పాతుకుపోతున్న మీ అభివృద్ధి నమూనాలో అవ్వల్ హైదరాబాద్ ఎక్కడ? ఎవరిదీ హైదరాబాద్.. హైదరాబాద్ తెలంగాణ గర్భం... తెలంగాణ కట్టుకు న్న కోట. ఆ మాటకొస్తే అది పొందిచ్చిన కులీకుత్‌బ్‌షాహీదీ కాదు.
మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ది అంతకన్నా కాదు. ప్రపంచీకరణకు హైదరాబాద్‌ను బార్లా తెరిచి వందల వేల ఎకరాలు అప్పనంగా కంపెనీలకు అప్పగించిన చంద్రబాబుదీ కాదు. చంద్రబాబు దారిని వెడల్పు చేసి రింగురోడ్డుగా నట్టింట్లోకి సంపద దారులు వేసుకున్న రాజశేఖర్‌రెడ్డిదీ కాదు.. గవర్నర్ నరసింహన్‌ది అంతకన్నా కాదు..
ఒక ఆయన దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం అనడానికి.. ఒక అవ్వ ..కాదుపో అనడాని కి.. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తూ కాదు.. సామూహికతలో, సౌకర్యాలలో, స్వభావంలో.. అలంకారాలలో, ఆకర్షణల్లో, పోగొట్టుకున్నాం.. నిజమే..పొందడానికే ఇప్పుడు తెలంగాణ అడుగుతున్నవాళ్లకీ హైదరాబాద్ పంచాయితీ పదేపదే తెస్తున్న వాళ్లకీ..హెచ్చరిక. హైదరాబాద్ భూమి పంచాయితీ కాదు. ఆస్తి తగాదాకాదు.
అదొక పెట్టుబడి దుర్గంగా భావిస్తున్న వాళ్లకీ.. అమెరికాకు అమ్ముకునేందుకు నమూ నా నగరంగా ఊహిస్తున్న వాళ్లకీ..ఒకటే కొండగుర్తు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం గా తెలంగాణ ప్రజలు అంగీకరించరు. ఇది అన్నదమ్ములు పంచుకునే ఆస్తికాదు.
హైదరాబాద్ ఒక ఆస్తితగాదా కాదు. ప్రజల నెత్తురూ.. కన్నీళ్లు.. ప్రవహించిన సంస్కృతీ ప్రవాహం.. కాపాడుకోవడానికే ఈ కొట్లాట. బతుకుదాం అందరం.
కాదనడం లేదు. సికాకోల్ నుంచొచ్చిన సోంపేట కూలీ, పాలమూరు కరువు నుంచొచ్చి న కూలీ.. బతకడానికొచ్చిన ఐటీ కూలీ.. అందరం బతుకుదాం.. కానీ రామలింగరాజు ఆరువేల ఎకరాలు, జీవీకేల ఇరవై వేల ఎకరాలు.. ఆ సిటీలూ.. ఈ సిటీలు.. ఎమ్మార్ ప్రాపర్టీలు, ల్యాంకోలు, గోల్ఫ్ కోర్సులు, కండ్ల ముంగట హైదరాబాద్‌ను దోచుకున్న వారి సంగతి వేరు.. కోస్తా ఉత్తరాంధ్రా, రాయలసీమా, తెలంగాణ సామాన్య ఉద్యోగులారా! ఇక్కడ మీరున్నందుకు ఈ నగరం మీది కూడా.. హైదరాబాద్‌ను ప్రేమించండి అది మిమ్మల్ని ప్రేమిస్తుంది.
కానీ అదొక ఆస్తి తగాదా అనుకుంటే.. కొట్లాటవుతుంది.. ఇది అవాంఛనీ యం. హైదరాబాద్ తెలంగాణది. ఆనక అందరిది. కానీ..కేంద్రానిది కాదు.. కాబోదు..యే పురానా షహర్ హమారా!.. హమారాహీ రహేంగే.. రంగారెడ్డి.. నల్లగొండ,మెదక్, మహబూబ్‌నగర్‌ల భూములు, జాగలు, నదీ నదాలు.. కలిసి వెలసిన హైదరాబాద్ తెలంగాణది.
Saturday, August 14, 2010
ప్రతిమల పతనం
బౌల్డర్‌హిల్స్ అంటే రాతిగుట్టలు. దుబాయ్ కంపెనీ ఇంకా కట్టని విల్లాలకు పెట్టిన పేరది. కంపెనీ పేరు ఎమ్మార్ ప్రాపర్టీస్. ఈ రాతిగుట్టల కింద ఏడుగురు గ్రామదేవతలు సమాధయ్యారు. గ్రామదేవతలంటే వెంకటేశ్వరస్వామి అంతటి శక్తిసంపన్నులు కాదు గానీ, నానక్‌రామ్‌గూడలో ఎనభైనాలుగు పేద కుటుంబాలకు వాళ్లు దేవతలే. పోశమ్మ.. మైసమ్మ.. మారె మ్మ ఎవరైనా కావొచ్చు. వాళ్లకిప్పుడు దేవత లేదు. బొట్టుపెట్టి బోనం పోసుకుందామన్నా.. నైవేద్యం పెట్టుకుందామన్నా.. వాళ్లకు ఇక ఏ దేవతాలేదు.
దైవం సరే.. ఏడాదికో పూట.. కానీ రోజు పూట గడిచే అర ఎకరమో.. ఎకరమో పొలంకూడా లేదు. అదీ ఈ రాతి గుట్టల కింద కప్పడిపోయింది. అక్కడ ఇప్పుడు..విరామంతోనూ, తీరికతోనూ, తిన్నది అరగడానికి గోల్ఫ్ పచ్చిక మైదానాల మీద అడుగులో అడుగేసి, ఆరామ్‌గా గోల్ఫ్ గుంటల్లోకి బంతు లు కొట్టే పెద్దమనుషులు క్రీడలాడుకుంటున్నారు. నిజానికి నానక్‌రామ్‌గూడ ముత్యంరెడ్డి, సత్తెమ్మ, అంజిరెడ్డిల జీవితాలతో పెద్దలాడుకున్న

Monday, August 9, 2010
క్షతగాత్రం...
అంతా బాగానే ఉన్నట్టుంటుంది. మబ్బులు చెదిరినట్టు.. పొద్దు పొడిచినట్టు.. సూర్యకిరణంలా ఆశ వెలిగినట్టు.. ఆశను ఎలాస్టిక్‌లా సాగదీసినట్టు..కొద్దిసేపే.. జయం.. విజ యం.. మత్తింకా వదలక ముందే.. మళ్లీ ముసురు. మళ్ళీ రాజకీయ మబ్బులు. మళ్ళీ కమ్ముకునే చీకటిలాంటి దుర్భేద్యమైన అజ్ఞానపు, అహంకారపు రాజకీయ మాటల మూటలు.. తెలంగాణను రానివ్వరనే కంటే అనైతికంగా అడ్డుకునే వారెవ్వరనేదే అసలు ప్రశ్న. హేతువుకు అందకుండా, తార్కికతకు తావు లేకుండా.. బుర్రలో పుట్టిన బుద్ధి కొలమానాల అంచనాలు.
విశ్లేషణలు. ఆరోపణలు. అవహేళనలు. ఎకసక్కాలు. మళ్లీ ఎవర న్నా పిరికిపందలు ఆత్మహత్య చేసుకుంటే.. భయమేస్తున్నది ఇషాన్.. నువ్వొక పిరికి పందవి.. మైసమ్మకు మేకల్ని బలిస్తారు. నువ్వొక అమాయకపు మేకవి. నిన్ను నువ్వు బలిచ్చుకోవడానికి ఏం మిగిలిందని? ఎవడి గెలుపు కోసమో? ఎవడి ఓటమి కోస మో.. బావుల్లోకి ఉరుకుతున్న వాడా.. నువ్వొక బలిమేకవి.
నీది ఆత్మహత్యా! బహురూపుల రాజకీయ నేతలు చేసిన హత్యా! ఇషాన్ .. నీ శవం ముందు భీకర ప్రతిజ్ఞలు, కన్నీళ్ళు, వేదన, ఉక్రోశ, ఆక్రోశాలు.. కమ్ముకున్న దిగులు. మీ అమ్మ అట్లాగే ఉంది. దిగులు గూడులా.. మూటలా పడి ఉన్న నిలువు దుఃఖం మీ అమ్మ. ఏం చెబ్తావ్. ఇషాన్. తెలంగాణలో పుట్టిన వాడివి కదా. మాటలకు తూటాలు తొడిగే నేల మీద పడిన వాడివి. పారాడిన వాడివి కదా. బతుకు అంటే నిత్య సంక్షోభం, అనునిత్య పోరాటం అనే చోట కన్ను తెరిచిన వాడివి కదా. కొన్ని శవాలు.
కొన్ని ఛిద్రమైన కలలు. కొన్ని భావుకతలు. ప్రపంచ జ్ఞాన నేత్రం కూడా తెరుచుకున్న వాడివి కదా. ద్రోహులెవరో? తెలుసు. హంతకులెవరో తెలుసు. ఏ తీపి మాటల వెనుక ఎంత విషం ఉందో? తెలుసు. ఏం చెయ్యాలో ? తెలుసు. బాబ్లీ డ్రామాలు కనిపెట్టిన వాడివి. పోలవరం డ్రామాలతో పోదు. నిలబడి నిజపోరాటం చెయ్యమని కోరిన వాడివి. జ్ఞానం ఉన్న వాడివి. ఇషాన్. నిన్నిక కీర్తించలేను. ఆత్మహత్య నైతికతల ప్రకారం, అలౌకికతల ప్రకారం మహాపాపం. ఆత్మహత్య ఒక చేతగాని , చేవలేని, బలహీన మనస్కుడి అంతరంగ కల్లోలం. తెలిసి తెలిసీ, ఆత్మహత్య చేసుకున్నందుకు జీవితకాలం నిన్ను క్షమించలేను. కీర్తించలేను. అమరుడివన లేను.
వీరుడవనలేను. క్షమించు ఇషాన్. నీ కోసం మీ అమ్మ లాగే నేనూ రెండు వెచ్చటి కన్నీటి బొట్లు వదలగలను. కానీ.. అసహాయంగా నీ దేహం ముందు నిలబడి నిలువు శోకంలా .. నువ్వు మీ పెదనాన్ననీ, చిన్నాననీ.. నీ బాపునీ మోసం చేశావు. లౌకికతల ప్రకారం ఆత్మహత్య పిరికిందల చర్య. నిజమే. నీ తర్వాత కొంత పరంపర. రోజూ రెండూ మూడూ .. సంఖ్యలు భయపెట్టే సందర్భం. అంకెలు భీతి గొల్పే సమయమిది. నిజమే. మరు నిమిషంలోనే విజయాన్ని అవహేళన చేసినప్పుడు నారా జ్ అవుతాం. వాళ్లు కోరిన పరిధిలోనే.. వాళ్లు పెట్టిన షరతుల పరిధిలోనే. వాదం ఉంటే. గెలిచి చూపించమన్న పరిధిలోనే . నిలబడి గెలిచి చూపేదే అసలు తెలంగాణ.
ద్రోహ చింతన ఒకరిదని కాదు. చిదంబరంది. కేంద్రానిది. సోనియా గాంధీది. మాయమాటలు చెప్పే తెలంగాణ కాంగ్రెస్ నేతలది. అడ్డగోలు వాదన లు చేసే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలది. రాజీనామాల అనంతరం గోసులు ఎగబోసుకుంటూ పోటీకి దిగిన భారీ కాయాల.. అంగుష్టపు బుద్ధులది. మెదడు నిండా ఒకే ప్రాంతపు అధిపత్యం. కళ్లల్లో రెండు నిలువు నాటకాలు.
అంగుట్లో అలవాటైన పచ్చి అవకాశ వాద పరిభాష. నిలువెత్తు మోసం. ఉద్వేగాలతో.. ఆడుకునే నీచం. నాయకుని బానిస. తెలంగాణ పోటీదారు. కన్నీళ్లలోనూ కల్మషం. ఏం చెప్పను పోటీపడి, సిగ్గులేకుండా నాటకాలాడి. తెలంగాణకు ఎదురీది.. ఎదురేగి, భంగపడ్డ బానిసల మాటలు ములుకులే. శరాఘాతా లే. అయితే మాత్రం. ఎవడు పట్టించుకుంటాడు. రుద్రభూమి నీది. ఎంత చరిత్ర చెప్పను. గెలుస్తా మా? నిలుస్తామా? సందేహాలు.. సందిగ్ధాలూ మనవి కావు. ఎక్కడ అక్రమం ఉంటుం దో, అక్కడ! ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ! ఎక్కడ రాజ్యం పడగ విప్పుతుందో? అక్కడ.
ఎక్కడ దోపిడీ మూలుగలు పీలుస్తుందో . అక్కడ దండోరాలు కొట్టి దండయాత్రలు చేసిన వీరభూమి మీద పడిన వాడా! పోరాటమే ఊపిరిగా ఎదిగిన నేల మీద. ఎన్ని చరిత్రలు ఎన్ని సార్లు చెప్పాలి. రక్తంలో పోరాట తత్వం ఉండాలి. రాదా! రాకపోయిన కానీ కొట్లాడు. విజయమో? వీర స్వర్గమో? ఒక నినాదం. కానీ.. ఎవరిని వారు కాల్చుకునే నిస్సహాయ, అసహాయ అవమాన సంస్కృతి ఎందుకు అబ్బింది ఇషాన్‌రెడ్డీ.. నిజమే. ఒకరు గెలిచినవి పదకొండే కదా! ఎవరివి వాళ్లకే అనవచ్చు.
నేరుగానే అవమానపరచవచ్చు. ఓటు వేయని నలభై శాతం మంది సమైక్యవాదులే అనే విదూషక రాజకీయ వేత్తా ఉండవచ్చు. పాత వాదనలను కొత్త తెరమీద కు తెచ్చి మనసును గాయపరచవచ్చు. న్యాయం ఏ పక్షం? మిత్రులారా! ఎవరి ది ప్రాంతీయవాదం! నిజ మే వెనుకబాటుతనం, ఆర్థికాభివృద్ధి, అంకెల గారడీ, నీళ్లూ, నిధులు, కాలువల మళ్లింపులు, సంస్కృతి.. చావుబతుకులు, భాష, యాస అరిగోసలు అనేకం చెప్పీ, చెప్పీ నోరు నొప్పు పుట్టి.. ఇక ఒకే ఒక మాట. ఏదీ లేదు. అసలు వాదనే లేదు.
ఒక ప్రాంతంగా విడిపోవడానికి.. ఉన్న హక్కుగామాకు తెలంగాణ కావాలె. వాదనలు బంద్. అది మీరిస్తే తీసుకొనేది కాదు. ఒక అమ్మ ఇయ్యడానికి.. ఒక అయ్య మూయడానికి తెలంగాణ దుక్నం కాదు. సమైక్యమో.. ఆంధ్రమో.. తెలుగో.. సమగ్రతో... దేశమో.. జాతో.. నీతో.. రీతో.. రివాజో..జాన్తానై. కలిసి ఉన్నాం. కుదరదనుకుంటున్నాం. అది మా ప్రాంతం మీద మా హక్కు. నక్సలైట్లో? దొరలో? దొంగలో? బద్మాషులో? దుర్మార్గులో? హంతకులో? ఎవరో ఒకరు.. ఒక ప్రాంతం స్థితి గతుల సంగ తి.. ఒక ప్రాంతం బాగోగుల సంగతి ఆ ప్రాంతానికి వదిలితేనే మర్యాద.
ఇదీ ఇషాన్.. నువ్వు చనిపోకుండా మాట్లాడాల్సిన మాట. అదే యూనివర్సిటీ లైబ్రరీముందు.. అదే ఆర్ట్స్ కాలేజీ ముంగట.. అదే యూనివర్సిటీ తారురోడ్డు మీద నెత్తురు కోలాటమాడిన వాళ్లంతా ధైర్యంగానే ఉన్నారు. జులుస్ తీసి జులుమ్‌లను ఎదిరించిన వాళ్లంతా ఇంకా మనసునిండా దట్టించిన ఉద్వేగాలతో నిలిచే ఉన్నారు. వాళ్లొక సభ అవుతున్నారు.
కదిలిపోతున్నారు. కన్నీరవుతున్నారు. కూడలిలో తమను తాము కూడగట్టుకున్న ఊరేగింపు అవుతున్నారు. ఒక కంట కన్నీరు.. మరో కంట నెత్తురు... తెలంగాణ జీవితమే అంత. అశ్రువొక్కటి ధారవోసిన త్యాగాల గడ్డ మాత్రమే కాదు. నెత్తురు చిందించిన వీరగడ్డ కూడా. ఆత్మహత్య ఎంతమాత్రం త్యాగం కాదు. ఆత్మహత్య ఎంతమాత్రం.. నీ ఆకాంక్షల సాఫల్య ఆయుధం కాదు. ఆత్మహత్యవద్దు.. ప్రియమైన పిల్లలారా! ప్రియమైన కనుపాపలారా! హంతకుడెవరు? అండమాన్‌లకు పంపాల్సిన రాజకీయ నాయకులే హంతకులు.
న్యాయం అడిగిన ప్రతిసారీ; ధర్మం అడిగిన ప్రతిసారీ.. రాజ్యాంగం ప్రసాదించిన విడిపోయే హక్కు అడిగిన ప్రతిసారీ.. బుల్లెట్లిస్తారు. సరే. భరిస్తాం. లాఠీలిస్తారు.. సరే నెత్తురోడుతాం. కానీ అబద్ధాలిస్తారు.. ఆటు మాటలిస్తారు. పోటు మాటలిస్తారు. అదే సమస్య. అదే కత్తి నేరుగా దిగనికుట్ర. పొడిచే పోటుకన్న మాయమర్మం. ఇప్పటి సమస్య.
అది కనిపెట్టి తిరిగినవాడే నేటి హీరో.. మార్మిక మంత్రాల మాయల మరాఠీ ప్రాణం దూరిన చిలకను మెడపిసక గలిగినవాడే నేటి హీరో.. కుట్రలనూ, కుతంత్రాలను ఎదిరించి నిలబడగలిగిన వాడే మొనగాడు.. వాడు వీధిలో రెండు కాళ్లు నిగడదన్ని నిలబడి నినదిస్తున్న ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి..ఇషాన్ నిన్ను ప్రేమించలేను.. నిన్ను కీర్తించలేను. ఎవడు యుద్ధరంగంలో క్షతగాత్రుడయినా వీరోచితంగా నిలబడి ఉన్నాడో.. వాడికే నా వందనం.. హంతకుడు తెలుసు.. హంతకుడి మీద కత్తి ఎత్తిన వాడే కథానాయకుడు.

Saturday, July 31, 2010
పాదపాదాన పరిపరి దండాలు..
చాకలి శ్రీనివాస్ గెలిచాడు. ధర్మపురి శ్రీనివాస్ ఓడిపొయ్యాడు. ఉప ఎన్నికల్లో చాకలి శ్రీనివాస్ అభ్యర్థికాడు. ఇప్పుడు తన గెలుపును తాను ఆస్వాదించడానికి ఈ భూమ్మీద కూడా లేడు. మరణానంతర మెరుపు నక్షత్రం అతను. తెలంగా ణ కోసం విరిసిన తార అతను. డీ.శ్రీనివాస్ అనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి చాకలి శ్రీనివాస్ ప్రత్యర్థీ కాడు.
కానీ డీ. శ్రీనివాస్ మందూ, మార్బలాన్ని, నోట్లకట్టలను, రెండుముఖాలను, ఆడి తప్పిన అబద్ధాల పుట్టను..మొత్తంగా ఎలక్షనీరింగ్ అనే సవాలక్ష అక్రమాల గనులను బద్దలు కొట్టి గెలిచాడు చాకలి శ్రీనివాస్. వరంగల్‌లో మిర్యాల్‌కార్ సునీల్‌కుమార్ గెలిచాడు. అతనొక జర్నలిస్టు. తెలంగాణ కోసం నిలువునా ప్రాణం తీసుకున్నా డు సునీల్. రాయరాని, రాయలేని, రాయజాలని వార్తల కోసం మరణించిన సునీల్ గెలిచాడు.
అతని ఆత్మ మళ్లీ ఒకసారి వరంగల్ జిల్లా మీద తెలంగాణ మనసుగా.. ఏకాత్మగా వెలుగుతున్న ది. పేర్లెందుకు? ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక సాయికుమార్ మీగడ, ఒక సవేరా బేగమ్.. శిల్పాల మీద చెక్కాల్సిన నాలుగువందల మంది పైబడిన తెలంగాణ ఆకాంక్షలు వాళ్లు.. మరణానంతర విజయ సోపానాలు వాళ్లు.. ఎన్నికల విజయా లు.. మన దేశపు భ్రష్టుపట్టిన 'ఎలక్షనీరింగ్ ప్రలోభాల వల్ల కురచవి. తాత్కాలికమైనవి. అంతిమ పరిష్కారాల సాధనలో ఉపయోగపడనివి.
అలాంటి కురచ విజయాలను మహా శిఖరంలా మలిచిన వాళ్లు తెలంగాణ ప్రజలు. ఏమివ్వగలం..వారికి.. తెలంగాణ తప్ప. ఒక భ్రష్టుపట్టిన ఎన్నికల రూపాన్ని కూడా టీఆర్ఎస్, బీజేపీ దుమ్మురేపడానికి.. కాంగ్రెస్, టీడీపీ దిమ్మ తిరగడానికి అస్త్రంగా మలుచుకున్నారు తెలంగాణ ప్రజ. ఏకాత్మను అంగీకరిస్తామా? లేదా? అవునిది ఏకాత్మే.. హూ ఈజ్ అరవిందరెడ్డి.. తెలంగాణ తేల్చుకు రమ్మని, సైరనూది సమర రంగాన కదను తొక్కకముందు.. అరవిందరెడ్డి టీఆర్ఎస్‌తో గొడవలో ఉన్నాడు.. కేసీఆర్ అతనికి ద్రోహిగా కనబడ్డాడు. వై.ఎస్. దేవుడి గా దర్శనమిచ్చాడు.
ఇవ్వాళ అరవిందరెడ్డి మెజారిటీ డెబ్భైఏడు వేలా.. ఎవరు గెలిచారు. మంచిర్యాల్ గెలిచింది. మంచిర్యాల్ నిలిచింది. చరిత్రను తిరగరాస్తున్నది తెలంగాణ. ఒక ముసల్మా ను కాషాయ వర్ణపు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని జైతెలంగాణ అంటూ యెండల లక్ష్మీనారాయణ గెలుపు కోసం దూలాడినట్టు.. దుంకినట్టు ఎగరడం ఊహించగలరా? నిజామాబాద్ విజయగర్వం చూడండి. దేనికి సూచన ఇది. మతం లేదు. కులం లేదు. నోట్ల కట్టలు లేవు. మందు లేదు. బ్రాందీ లేదు. వాగ్దానం లేదు.
వాగాడంబరం లేదు. ఐసు ఐసు పథకాలు లేవు. నైసునైసు మాటలు లేవు. ఒకటే ఉనికిలో ఉంది. ప్రజల మనసు ల్లో.. లోపలి పొరల్లో.. ఇంకిపోయింది తెలంగాణ. పాతుకున్నది తెలంగాణ. కొప్పుల ఈశ్వరా? కావేటి సమ్మయ్యా.. చెన్నమనేని రమేశా? కల్వకుంట్ల తారకరామారావా? తన్నీరు హరీష్‌రావా? వినయ్‌భాస్కరా? ఈటెల రాజేందరా? ఏనుగు రవీందర్‌రెడ్డా? నల్లాల ఓదెలా? ఎవరైతేనేం విజయానికి ఒక ప్రతిమ కావాలి. విజయానికి ఒక రూపు కావాలి. విజయానికి ఒక పేరు కావాలి.
నిజమే హరీష్ హుర్రే.. హుర్రే.. తొంభైయిదు వేల మెజారిటీ. అదీ చరిత్రే. అతను, ఈటెల రాజేందర్ మంచి ఎమ్మెల్యేలు కూడా కావొచ్చు. అయినా మరీ అంత ఏకపక్షం ఎలా సాధ్యం.. నాలుగు వందల మంది అమరవీరుల బలిదానాలకు అంకితమిచ్చిన హరీష్‌రావు, ఈటెలల విజయం తెలంగాణ ప్రజల విజ యం. చనిపోయిన వారి ఆత్మలు మేల్కొనడమంటే ఇదే.. వాళ్ల ఆత్మలు ఆకాంక్షలై ప్రతిఫలించడమంటే ఇదే.. నలుగురు వెలమదొరలు ఒకేవాహనం మీద ఎక్కి ఎములాడల, సిరిసిల్లల తిరిగి ఎన్నికల ప్రచారంల మాట్లాడి నిలిచి.. గెలవడం ఎట్లాసాధ్యం.
అది సిరిసిల్ల.. అది జగిత్యాల. అయినా సాధ్యమే. తెలంగాణకు ఇప్పుడు ఏ ఎజెండా లేదు. ఒకే ఎజెండా.. విద్యాసాగర్‌రావు, రమేష్‌రావు, తారకరామారావు, చంద్రశేఖర్‌రావు ఎవరైతేనేం? వాళ్లే తెలంగాణ ఆత్మలను ఆవాహన చేసినంత కాలం గెలుస్తా రు. మరో మాట లేదు. ఉన్నదొకటే ఎజెండా? దొరలు .. తర్వా త.. ముందు మా తెలంగాణ మాగ్గావాలె.
మతం తర్వాత మా తెలంగాణ మాగ్గావాలె. కులం తర్వాత మా తెలంగాణ మాగ్గావాలె.. యథా ప్రజ .. తథా రాజ.. రాజులారా! ఇక తెలంగాణల ఇదే నిజం.. ప్రజలున్నట్టు మీరుంటేనే భూమ్మీద మీకు నూకలు..లేదంటే మీకు నూకలు చెల్లు.. నిజమే సర్వ అవలక్షణాలనూ తెలంగాణ ఓడించింది. బాబ్లీ ఎందుకంటావో? తెలుసు.. బాబ్లీ వెనువెంటనే మీరు తెచ్చిన తెలుగు జాతి ఆత్మగౌరవం ఎంత ప్రమాదకర నినాదమో తెలుసు. ఇరవై ఎనిమిది ఏండ్ల క్రితానికి, ఎన్టీఆర్ కాలానికి వెళ్లడానికి సిద్ధంగా లేదు తెలంగాణ.
ఆత్మగౌర వం ఒకమాయ. అదొక అబద్ధం. నిజమే బాబ్లీ అన్యాయమే కావ చ్చు.. కానీ ఆ తర్వాతి తెలుగుజాతి ఆత్మగౌరవం తెలంగాణ గౌర వం పీకనొక్కి న క్రితం ఒక చేదు జ్ఞాపకం. ఎంత విజ్ఞత తెలంగాణది. తెలుగుజాతి ఆత్మగౌరవ అసలు అంతరంగ స్వభావాన్ని బీజరూపంలో పసిగట్టిన సిస్మొగ్రాఫ్ తెలంగాణ. ఇప్పుడు అది రాబోయే పెను ముప్పును కనిపెట్టగలదు. రెండు కళ్ళ సిద్ధాంత కర్తల అసలు దృష్టినీ, అవతారాన్నీ కనిపెట్టగలదు. డిపాజిట్లు గల్లంతవుతాయి జాగ్రత్త.. ఇక చెల్లదు.
ఇది గుర్రం ఇది మైదానం. అటా.. ఇటా.. ? ఎటో ఒక దిక్కే.. తొమ్మిదో తారీ ఖు గీటురాయి. నువ్వేం మాట్లాడ్తున్నావో? బాబ్లీ అనంతర ఆత్మగౌరవం ఎవరిదో .. పసిగట్టింది తెలంగాణ. డీ. శ్రీనివాస్ బంగా రు పళ్లాన్ని నమ్మలేదు తెలంగాణ.. చెన్నారెడ్డి బంగారు పళ్లెంలో పెట్టి మున్నూటా డెబ్భై మంది తలలను ఇందిరాగాంధీకి సమర్పించిన ద్రోహం.. ఎక్కడ మళ్లీ ప్రారంభమవుతున్నదో పసిగట్టింది తెలంగాణ. మహా ఉద్యమ అనంతరం ..మహా ఊరేగింపుల అనంతరం.. మహా జనసాగరాల అనంతరం.. ఒకే ఒక్క మాట.
తెలంగాణ. నిజమే.. తెలంగాణ కోసం మరణించిన ఒక కొడుకు కోసం పరితపించే ఒక తల్లికి ఈ విజయాల పూలహారం. ఆ అమ్మకిప్పుడు నాలుగు కోట్ల మంది కొడుకులు, కూతుళ్లు. తెలంగాణ కోసం వాళ్లు నిలబడ్తున్నారు. ఇస్తమని ఇవ్వరు. తెస్తమని తేరు. శవాల మీద పడి ఏడ్చిన వాళ్ళు కన్నీరు ఇంకక ముందే కల్లబొల్లి కబుర్ల కాకారాయుళ్లవుతరు. అందుకే.. బహు పరాక్.. బానిసకొక బానిసకొక.. బానిసలోయి బానిసలయిన తెలంగాణ ప్రియనేతలా రా! కాంగ్రెస్ మసిబూసి మారేడు కాయ చేస్తే.. ఇచ్చిన మాట తప్పితే బండకేసి కొడ్తది తెలంగాణ.
రెండు కండ్లు..మూడు నాల్కలు.. ఐదు ముఖాలు.. ఆరు ఆత్మగౌరవాలు చెల్లవు గాక చెల్లవు.. తెలుసుకోండి..మేల్కొన్నది తెలంగాణ.. నిజమే.. పన్నెండు సీట్లతో తెలంగాణ రాదు. మరో పన్నెండు సీట్లతో రాదూ పోదు. కానీ.. చరిత్ర నిండా.. కాలం నిండా.. తెలంగాణ ప్రతి మలుపులోనూ.. ప్రతి సందర్భంలోనూ.. తెగేసి చెబుతున్న ది.
నిలేసి అడుగుతున్నది. నీళ్లు నమలకు.. మరో మాట లేదు. ఇది తెలంగాణ ప్రజల విజయం. నిలబడి, కలెబడి నిలిచి గెలిచిన తెలంగాణ రేపటి పొద్దు తెలంగాణలోనే.. లేదా.. బానిస నేతలకు పుట్టగతులు లేవు.. మరి రావు.. మరోసారి.. మరోసారి. ఈ గడ్డమీద పుట్టిన ప్రజలకు.. ఈ గడ్డ కోసం ప్రాణాలను తృణప్రా యం చేసుకున్న వీరులకు ... వినమ్రంగా పాదపాదాన.. పరిపరి దండాలతో... హేల్ తెలంగాణ.. హేల్.. తెలంగాణ పీపుల్..

Saturday, July 24, 2010
సోంపేట తొలిపొద్దు..
ఆఊరు మీకు బాగా నచ్చుతుంది. అమెరికాలో మాడిసన్‌కు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరీ నా లాగే. అయితే ఆ ఊరు ఎరీనా మొక్కజొన్న చేలల్లో కవి త్వం గుణ్‌గుణాయించే వాళ్లలా మాత్రమే ఉండదు. ఆ ఊరు చిత్తడి నేలల్లో నెత్తురు చిందించి బీలను కాపాడుకునే ఊరు. ఉత్తరాంధ్ర కోనసీమ. ఉద్దానంలో ఆ ఊరు. పేరు సోంపేట.
యాధృచ్ఛికం కాదుగానీ, సోంపేట, బారువాల మధ్య పెదబీల, చిన్న బీలల్లో నీళ్ల కోసం భూమిని రక్షించు కోవడం కోసం యుద్ధానికి తెగబడిన సోంపేటకు, కడుపు లో నీళ్లు కదలకుండా ఉండడం కోసం పలాసపురం గున్నజోగారావు, గొనప కృష్ణమూర్తి తమ మరిగే నెత్తురును ధారవోసిన సోంపేటకు, కడుపులో చల్ల కదలకుండా కవి త్వం చదువుకొని పురాయాదులను తవ్వుకొనే ఎరీనా రైతు కవులకు పోలిక ఉంది.
ఎరీనా నిశ్చల చిత్రం. సోంపేట సుడులు తిరిగిన జలతరంగ దృశ్యం. సోంపేట ఇప్పుడు నడుస్తున్న విస్థాపనకు, విధ్వంసక అభివృద్ధికి, ప్రభుత్వాలు వారే, దళారీలు వారే, కార్పొరేట్లు వారే అయిన వ్యవస్థీకరించిన పాలక పక్షాలకు ప్రాణాలొడ్డి పంట చేలల్లో ఉత్త చేతులతో, కొత్త గొంతులతో, కర్రలతో, కాళ్లకు కట్టుకున్న చేతనా విద్యుత్ తరంగాలతో గెడ్డెలు పోటెత్తినట్టు, ఎగిరి దుంకిన ట్టు ఎదురీది నిలబడిన కడలి తరంగం. హద్దులు చెరిగిపోయిన వ్యవస్థాపక నిర్మాణాలిప్పుడు ప్రపంచవ్యాప్త వ్యవస్థ లు.
అమెరికా దానికి మూలం. అది తన్నుతాను ధ్వంసం చేసుకుంటూ ప్రపంచాన్ని ధ్వంసం చేసే అభివృద్ధి నమూనాలను సరఫరా చేస్తున్నది. ఎరీనా పురాస్మృతులేవైనా ఉంటే, అవే. 'సమ్మతి తయారీ' గురించి రాసిన నోమ్‌ఛామ్‌స్కీకి, భారతదేశంలో ఇదే తరహాలో సమ్మతి తయారీ యే కాదు 'ప్రభుత్వాల తయారీ' కఅూ్ఖఊఅఇఖ్ఖీఖఐూఎ ఎౖగఉఖూకఉూఖీఖి సంగతి ఇంకా ఉప్పందవలసే ఉన్నది.
మనవాళ్లు ఈ మార్గంలో మధ్యలో లేరు. ఎంతో ఎత్తు ఎదిగారు. గనుల మాఫియా సామ్రాజ్యంతో కర్ణాటక ప్రభుత్వ తయారీని చేసి చూపించి, ఢిల్లీ ప్రభుత్వ తయారీకి నోట్లు కుడుతున్న, ఇనుప ఖనిజం జమ చేస్తున్న రెడ్డి సోదరుల గురించి కూడా నోమ్‌ఛామ్‌స్కీకి తెలిస్తే బాగుండు. కలకత్తా నుంచి నెల్లూరుదాకా తీరం పొడవునా ఆవహించే బొగ్గు కుంపట్లు థర్మల్ కారిడార్లు.. ఏ అభివృద్ధి కోసం.. ఏ మర్చంట్ విద్యుత్ కంపెనీల కోసం.. ఈ మర్చంట్ విద్యుత్ కంపెనీల లెక్కల కింద, ప్రణాళికల వెనుక, పైసా లెక్కల వెనక.. పెరిగిన వాల్యుయేషన్‌ల వెనుక ఎవరి వికృత ముఖాలున్నాయి.
థర్మల్ కారిడార్‌కు, వాన్‌పిక్‌లకు, ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఆరు థర్మల్ కుంపట్లకు మొత్తంగా భారతదేశాన్ని తవ్విపోసే గనుల ఘరానా దోపిడి, భూ ఆక్రమ ణ, బొగ్గు వేగవంతంగా తవ్వడానికి, మనుషుల శవాల బొందల గడ్డలు తవ్వుతున్న ఓపెన్‌కాస్ట్ తవ్వకాలకు, ఇండోనేషియాలో బొగ్గు గనుల కొనుగోలు చేసిన హస్తాలకు ఎంత లింకుందో? అంత లింకునూ గమనించనంత వరకు.. ఈ అభివృద్ధి విధ్వంసం వెనక ఉన్న వికృత ముఖం ప్రభుత్వం, కార్పొరేట్, దళారీ కలెగలిసిన ఒక మాన్‌స్టర్‌దేనని గమనించనంత వరకు సోంపేట ఒంటరి.
అది ఒంటరి కాదు. అదొక భారతదేశపు అనేక ప్రాంతాల జంటపదం. సింగూరు తనను తాను వెల్లడించుకున్నది కనుక.. నందిగ్రామ్ కూడా చనిపోవడానికీ, చంపడానికీ సిద్ధపడింది కనుక.. సోంపేటకు అవి జంట పదాలు.. భారతదేశం నిండా పెరిగిపోతున్న సోం పేటలు రేపటి సామాన్యు ల కదనరంగాలు. ఛత్తీస్‌గఢ్ కావొచ్చు. ఒడిషా నారాయణ్ పట్న కావొ చ్చు. బెంగాల్ కావొచ్చు. బీహార్ కావొచ్చు. అది సెజ్ కావొచ్చు. గని తవ్వకం కావొచ్చు. అభివృద్ధి కోసం, వెలుగుల కోసం, రసాయనాలకోసం, ఎరువుల కోసం తీసుకునే, ఆక్రమించుకునే ఏ భూమి అయినా కావొచ్చు.
బుగతగాడిప్పుడు మారువేషంలో ఉన్న మారీచుడు. వాడు అంతుబట్టని దళారీ, కార్పొరేట్ దొంగ, ప్రభుత్వ నేత. అన్నీ కలెగలిపిన మహారాక్షసు డు. ఎట్లా చంపగలవు. ఉద్దానం ఒకప్పటి స్టాలిన్‌గ్రాడ్. తామాడ గణపతి నడయాడిన నేల, సుబ్బారావు ప్రాణిగ్రాహి గానం సుడులు తిరిగిన నేల. బొడ్డపాడు నడిగెడ్డలో గరుడభద్ర బుగత మద్ది కామేశ్వరరావును చంపినంత సుల భం కాదిది. తంపర కోసం, పెదబీల, చినబీల కోసం, ఏడాది పొడవునా ఉద్దానాన్ని ఫిల్టర్ చేసే, వరదలకు రక్షిం చే, వానల్లేనప్పుడు దూపదీర్చే.. మూత్రపిండాలా చిత్తడినేలలు.. కొబ్బరి చిప్పల్లో నిలిచిన నీళ్లు డెంగీలు, చికున్‌గున్యాలు.. చివరికి మూత్రపిండాల వ్యాధులను కట్టబెట్టిన ఇదే ఉద్దానానికి థర్మల్ బొగ్గుకుంపటి.. బూడిద సముద్రా లు వచ్చి పడ్డాయి. ఇప్పుడిక అంత సులభం కాదు.
అందుకే.. డూ ఆర్ డై.. చావు లేదా చంపు.. నీటి కోసం నిప్పులా మండు.. దేశి గెడ్డకోసం.. గరీబుల గెడ్డ కోసం.. ఏనుగుల గెడ్డకోసం.. సోంపేట నెత్తురు ఏరులై పారినా సరే.. ఇప్పుడిక భూమి కోసం.. భూమిలేని వాళ్లు చేసే పోరాటం ఎంత మాత్రం కాదింక.. భూములు కోల్పోయిన వాళ్లు.. తమ భూములు కాపాడుకోవడానికి చేసే పోరాటం.. ఇదీ నలభై ఏళ్ల పోరాటాల, ఆరాటాల శ్రీకాకుళం ప్రశ్నే కాదు.
ఇదివ్వాళ్టి దేశం సామాన్యుల ముందు, రైతుల ముందు, మత్స్యకారుల ముందు, దళితు ల ముందు, స్త్రీల ముందు, అణగారిన వారి ముందు, అన్నార్తుల ముందు, అభాగ్యుల ముందు నిలువెత్తునా నిలబడిన ప్రశ్న.. సకల మానవ ప్రాకృతిక వనరులను పెట్టుబడికి అప్పగించడమే నేటి సూత్రం. అది ఢిల్లీ కేంద్రంగా ..జంగల్ మహల్ నుంచి ఉత్తరాంధ్ర దాకా.. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా దాకా.. మనిషి అవసరాలిప్పుడు.. పెట్టుబడి అవసరాలు.. మున్నూటా అరవై ఐదు పొద్దులూ నిన్ను కాపాడే తంపర, బీలలు థర్మల్ కుంపట్ల అవసరాలు.. అందుకే.. సోంపేట ఇవ్వాల్టి వేగుచుక్క. అదొక వ్యవస్థీకృతమైన విధ్వంసక దోపిడీ మార్గాన్ని ఎదిరించిన తొలిపొద్దు.. పర్యావరణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ, అక్రమాలు, అన్యాయాలు?, పారిశ్రామిక అభివృద్ధి లేదంటే ఎట్లా? కరెంటు వద్దా? వెలుగులెట్లా? అని నంగినంగిగా గుణ్‌గుణాయిస్తూ.. అడిగేవాళ్లకు.. బహుశా.. ఈ దేశం ప్రకృతిపైన, వనరులపైన, ఈ భూమిపైన ఆధారపడి బతికే మనుషుల నోటికాడి కూడు గుంజుకొని, కార్పొరేట్లకు కట్టబెట్టడా న్ని వ్యవస్థీకృతం చేస్తుందని, సింగూరు, నందిగ్రామ్, సోంపేటలు అందుకే అని తెలియకపోతే సోంపేట అర్థం కాదు.
83 సంవత్సరాల క్రిందట బారువాకు గాంధీ వచ్చి గ్రామ స్వరాజ్యం, స్వావలంబనల గురించి, స్వయం సమృ ద్ధి గురించి చెప్పిన మాటలు ఇప్పుడొక విధ్వంసక నమూనా అభివృద్ధిలో వినపడకపోవచ్చు. 223 దినాలు నిరాహారదీక్షలు గాంధీ గారి కోసం చేసినా.. కడుపులో నీళ్లు కలబారుతున్నప్పుడు ఇదే బారువా తీరవాసులు.. నెత్తురు డొల్లాడించడం వారి తప్పుకాదు.
గాంధీని అనుసరించని విధ్వంసక అభివృద్ధిది.. ఉద్దానం మళ్లీ ఒకసారి ఉత్థానంగా వెలిగింది. ఆ వెలుగు భారతావనిలో విధ్వంసక అభివృద్ధికి వ్యతిరేకమైంది. దాన్ని ఆరిపోకుండా కాపాడుకొందాం.. మనుషు లం.. మనుషులుగా బతుకుదాం.. పోరాడి అయినా సరే.. ప్రాణాలు పోయినా సరే.. అదొక్కటే దారి.. తెలంగాణ అయినా, ఉత్తరాంధ్ర, అయినా, సీమ అయినా విధ్వంసం.. వెనుకబాటుతనంతో పాటు తీవ్ర ప్రభావం చూపే ఒక వికృతం.. దాన్ని ఎదిరిద్దాం.. ఎరీనాలో కవిత్వం చదవడం ఒక కళ.. సోంపేటలా తిరగబడడం ఒక జీవన్మరణ పోరా టం... సోంపేట ఒక తుట్టే.. ఒక చిక్కుముడి.. అమెరికా నుంచి ప్రపంచానికి పరివ్యాపించిన ఒక జబ్బుకు సోంపేట తిరుగుబాట పరిష్కారం. (ఎరీనా కవిత్వ పఠనంపై అఫ్సర్ వ్యాసం సోమవారం 'వివిధ'లో వచ్చింది.)
Subscribe to:
Posts (Atom)